తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి వాతావరణం కనబడుతుంది. గత మూడు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. కానీ, రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు చల్లని గాలులు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కింద్రకు పడిపోయాయి. కొన్ని జిల్లాల్లో ఉదయంపూట పొగమంచు కమ్మేస్తుంది. ఇక, హన్మకొండలో సాధారణం కన్నా 2.7 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గి.. కనిష్ఠంగా 19.5 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌లో 117.2 డిగ్రీలు నమోదు కాగా.. మిగిలిన జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. పగటివేళ హన్మకొండ, మెదక్, రామగుండంలలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఖమ్మంలో మాత్రం సాధారణం కన్నా 3.3 డిగ్రీలు ఎక్కువగా.. గరిష్ఠ ఉష్ణోగ్రత 35.2 డిగ్రీలుగా ఉంది.
Read Also: Leo 2: ఆయన చేస్తాననిందే పది సినిమాలు… ఇలా సీక్వెల్స్ చేసుకుంటూ కూర్చుంటే అంతే ఇక
హైదరాబాద్, భద్రాచలం, ఆదిలాబాద్‌లలోనూ సాధారణం కన్నా కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే, మొన్నటి వరకు పగటిపూట ఎండలు మండిపోయాయి.. కానీ, రాత్రిళ్లు మాత్రం చల్లని వాతావరణం కనబడుతుంది. ఇప్పుడు మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో పాటు వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణపైనా ఈ తుపాన్ ప్రభావం ఉంటుందని అంచనా.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. అయితే వాయుగుండం తుపాన్‌గా మారి బంగ్లాదేశ్ వైపు వెళ్లి తీరం దాటుతుంది.. మరి వాయుగుండం ప్రభావం తెలంగాణపై ఎలా ఉంటుంది అన్నదే వేచి చూడాలి..