Kangana Raunat: రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన కంగనా రనౌత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ నిన్న ( అక్టోబర్ 24న ) దసరా వేడుకల సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన మొదటి మహిళగా ఈ ఘనత సాధించింది. కంగనాతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ రావణ, కుంభకరణ్, మేఘనాథుల దిష్టిబొమ్మలను కంగనా దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎర్రటి చీర కట్టుకుని చాలా అందంగా కనిపించారు.
Read Also: Astrology: అక్టోబర్ 25, బుధవారం దినఫలాలు
Also Read
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
అయితే, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఢిల్లీలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసిన తొలి మహిళగా కంగనా రనౌత్ చరిత్ర సృష్టించింది. రాంలీలా మైదానంలో రావణ దహనంతో పాటు శ్రీరాముడి మహిమను కంగనా కొనియాడింది. ‘శ్రీరాముడు ఉంటే మనం ఉన్నాం.. ఆయనలాంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు.. మళ్లీ రారు అని చెప్పింది. ఆ తర్వాత జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ రావణుడిని దహనం చేశారు. బాణసంచా కాల్చడం నిషేధించాలన్న ప్రభుత్వ ఆదేశంతో.. రామ్ లీలా మైదానం అంతటా శబ్ధం వినిపించే విధంగా ఎనిమిది ట్రాక్‌ల డిజిటల్ డాల్బీ సౌండ్ సిస్టమ్ ద్వారా బాణాసంచా శబ్దాన్ని రికార్డు చేశారు.
Read Also: Minister KTR: చావాలా.. బతకాలా నేనేం చేయాలి.. విచిత్ర అనుభవాన్ని చెప్పిన కేటీఆర్
ఇక, కంగనా నటించిన తేజస్ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ.. శ్రీరాముడు చెడుపై మంచి విజయ పతాకాన్ని ఎగురవేసినట్లే మన దేశ సైనికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి మనందరినీ కాపాడుతున్నారని అన్నారు. ఆర్‌ఎస్‌విపి నిర్మిస్తున్న తేజస్‌లో కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తోంది. సర్వేష్ మేవాడా రచన మరియు దర్శకత్వం వహించారు మరియు రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 27 న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
తాజావార్తలు
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్‌డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!