బీఆర్ఎస్ పథకాలు బీజేపీ- కాంగ్రెస్ నాయకులు కూడా పొందుతున్నారు.. కేసీఆర్ కు ఓటేయకుంటే నష్టం పోతాం.. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవు.. రైతు సంక్షేమానికి పాటుపడ్డ ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్.. రైతాంగానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాలి అంటూ జోగు రామన్న డిమాండ్ చేశారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడమే నా ప్రధాన ఎజెండా.. అందు కోసమే హుజురాబాద్, గజ్వేల్ లో పోటి చేస్తున్నాను తెలిపారు. కేసీఆర్ మధ్యం, డబ్బు సంచులను నమ్ముకున్నాడు.. హుజురాబాద్ లో ఎమ్మెల్యే ప్రోటో కాల్ విస్మరించారు అని ఆయన ఆరోపించారు.
నీకు ఎందుకు ఓటు వేయాలి అని సీఎం కేసీఆర్ కి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సవాల్ విసిరారు. తెలంగాణలో మహిళలకు రక్షణ ఉందా?.. అత్యాచారం చేసిన వాళ్ళకు అధికార పార్టీ నేతలు అండగా ఉన్నారు.. బాల్య వివాహాలు జరుగుతుంటే ఏం చేస్తోంది
అధికారంలో ఉన్న దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం నడుస్తుంది.. యుద్ధంలో ప్రజలు గెలవాలని రాహుల్ గాంధీ కోరుకున్నారు.. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్లు అని భట్టి విక్రమార్క ప్రకటించారు.
జగన్ మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపిస్తాను అని లోకేష్ అన్నాడు.. జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు అని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి భయపడే టైపు కాదు.. దేశాన్ని శాసించిన సోనియాగాంధీని లెక్కచేయని మగాడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. తిరిగి రేపు వేకువజామున 3:15 గంటలకు ఆలయ తలుపులను అర్చకులు తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేసాం.. రేపు ఉదయం ఆలయ తలుపులు తెరిచి శుద్ది చేస్తారు.
నెల్లూరు జిల్లా కావలిలో ఆటోనగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు డిమాండ్ చేశారు. నిరంతరం రాత్రి పగలు ప్రయాణీకుల రవాణా సౌకర్యాన్ని అందించేందుకు విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఈ మధ్య దాడులు పెరగడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త మ్యానిఫెస్టోతో రాబోతుంది అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం 2024 ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమైంది.. గుంటూరులో రేపు జరిగే ఓబీసీ సంఘాల సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
దోచుకో.. దాచుకో అనుకున్నందుకు చంద్రబాబు జైలు పాలయ్యాడు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మేం రెండు ఎకరాల్లో ఆదాయాన్నే తిన్నాము.. ప్రజల సొమ్ము దోచుకో లేదని నారా భువనేశ్వరి దేవుడి మీద ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. యాదవులను టీడీపీ ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంది.. నారా చంద్రబాబు, నారా లోకేశ్, దత్తపుత్రుడిని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం అని ఆయన వ్యాఖ్యనించారు.
జైల్లో ఉన్న చంద్రబాబుకు 50 రోజుల శుభాకాంక్షలు హర్ష ధ్వానాలతో చెప్పాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలను కోరారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దొరికిన దొంగ అంటూ విమర్శించారు.