విశాఖపట్నంలోని తగరపువలస పుట్ బాల్ గ్రౌండులో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో వైసీపీ మంత్రులు పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. సామాజిక సాధికార బస్సు యాత్ర తమ ప్రభుత్వం చేసిన అభివృద్దిని ప్రజలకు వివరించేందుకు అని ఆయన తెలిపారు.
Read Also: Virat Kohli: ఈసారి స్పెషల్గా కోహ్లీ పుట్టినరోజు వేడుకలు.. ఎక్కడంటే..?
అయితే, జైల్లో ఉన్న చంద్రబాబుకు 50 రోజుల శుభాకాంక్షలు హర్ష ధ్వానాలతో చెప్పాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలను కోరారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దొరికిన దొంగ అంటూ విమర్శించారు. చంద్రబాబుకు సిగ్గు లజ్జా ఉంటే నేను తప్పు చేయలేదని బెయిల్ అడగండి.. విచారణకు సహకరిస్తాను బెయిల్ ఇవ్వండి అని అడిగే పరిస్థితి చంద్రబాబుకు లేదు అంటూ మంత్రి మండిపడ్డారు.
Read Also: BSNL 4G: డిసెంబర్‌లో 4జీ సేవలను ప్రారంభించనున్న బీఎస్‌ఎన్‌ఎల్.. 5జీ అప్పుడే?
వయసు జస్ట్ నెంబర్ అని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు ముసలోడిని అయిపోయానని చెప్పుకుంటున్నారు అని మంత్రి సీదిరి అప్పల రాజు ప్రశ్నించారు. బస్సులు ఎక్కి డాన్సులు వేసినప్పుడు కనిపించని వయోభారం జైలుకు వెళ్ళినప్పుడు గుర్తుకు వస్తుందా అని ఆయన అడిగారు. వైసీపీ పార్టీ దళితులు, బీసీలు, ఆదివాసీలది అని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ పార్టీపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను చూసి ప్రతి పక్షాలు ఓర్వలేక పోతున్నాయని ఆయన అన్నారు.