నెల్లూరు జిల్లా కావలిలో ఆటోనగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు డిమాండ్ చేశారు. నిరంతరం రాత్రి పగలు ప్రయాణీకుల రవాణా సౌకర్యాన్ని అందించేందుకు విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఈ మధ్య దాడులు పెరగడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ఈనెల 26న బెంగూళూరు నుంచి విజయవాడకు వస్తున్న ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ కావలిలో రోడ్డుకు అడ్డంగా బస్సుకు సైడ్ ఇవ్వడంలేదని హారన్ కొట్టాడు.. అక్కడే డ్రైవర్ పై దౌర్జన్యానికి దిగారు అని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు తెలిపారు.
Read Also: Gujarat: ఏం కష్టం వచ్చిందో.. ఒకే కుటుంబంలో 7గురు ఆత్మహత్య..
అయితే అక్కడ ఉన్న ప్రయాణీకులు ట్రాఫిక్ పోలీసులు సర్ది చెప్పించిన అనంతరం రెండు కార్లుతో 14 మంది రౌడీలు వచ్చి బస్సును అడ్డగించి దాడి చేయడం దారుణమని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు మండిపడ్డారు. డ్రైవర్ బి. రామ్ సింగ్ ను సీట్లో నుంచి కిందకు లాగి విచక్షణారహితంగా రోడ్డుపై పడేసి ప్రాణహానికి కలిగేలా కావలిలో దాడి చేశారు అంటూ మండిపడ్డారు. దాడిని అడ్డుకోబోయిన మరో డ్రైవర్ పై కూడా దాడికి పాల్పడిన వారిపై నాన్ బెయిల్ బుల్ సెక్షన్లు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి అని బొప్పరాజు డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని రిమాండుకు తరలించాలన్నారు.