Off The Record: కాంగ్రెస్ గ్యారేజ్‌లోకి పని చేసే ప్రెసిడెంట్స్ వస్తారా..? లేదా..? దానర్ధం ఉన్న అధ్యక్షుడు పని చేయడం లేదని కాదు గానీ.. అసలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పోస్టుల్ని భర్తీ చేయాలన్న సంగతి పెద్దలకు గుర్తుందా లేదా అని ప్రశ్నిస్తోంది కేడర్. అదిగో.. ఇదిగో అని వాయిదాల మీద వాయిదాలు వేయడమేనా? అసలా పదవుల్ని భర్తీ చేసే యోచన ఉందా?
Read Also: HMD 100, HMD 101: HMD కొత్త ఫీచర్ ఫోన్లు విడుదల.. రూ. 1000 కంటే తక్కువ ధరకే
ఆపద మొక్కులు అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారం. ఎన్నికల సమయంలో మాత్రం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్స్, సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత అంటూ.. చాంతాడంత లిస్ట్ ఇచ్చారు. ఒక పిసిసి చీఫ్ గడువు ముగిసింది… కొత్త పిసిసి అధ్యక్షుడు వచ్చి.. ఆయన టర్మ్ కూడా సగం పూర్తయింది. కానీ pcc కమిటీలో కచ్చితంగా ఉండాల్సిన అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్స్ పదవులపై మాత్రం క్లారిటీ లేదు. ఇదిగో అదిగో అని ప్రకటనలు ఐతే వస్తున్నాయి కానీ.. కసరత్తు స్టేజ్ లోనే కాలం వెళ్ళదీస్తున్నారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ని నియమిస్తారని ముందు చెప్పారు. కాదు ఐదని తర్వాత లీకులు వచ్చాయి. కానీ ఇప్పటికీ ఒక్కరికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వలేదు. ఐతే తాజాగా జరిగిన కొత్త dcc అధ్యక్షుల సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం ఓ ప్రకటన చేశారు.
Read Also: Off The Record: జగిత్యాల కాంగ్రెస్‌లో జీవన్‌రెడ్డి వర్సెస్ సంజయ్
వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల్ని భర్తీ చేసుకోవాల్సి ఉందంటూ ఆయన ప్రకటించడం తిరిగి ఆశలు రేపుతోంది. ఏడాది క్రితం… రోహిణ్ రెడ్డి.. చామల కిరణ్.. సంపత్.. లాంటి నేతల పేర్లు చర్చలోకి వచ్చాయి. కానీ.. ఇప్పటి వరకు ఏదీ వర్కౌట్ అవలేదు. దీంతో ప్రభుత్వంలో పదవులు రాకపోయినా.. కనీసం పార్టీలోని కీలక పోస్ట్‌లను అయినా భర్తీ చేయకపోతే ఎలా..? అనే చర్చ నడుస్తోంది. ఇన్నాళ్ళు సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుపై ఆశలు పెట్టుకున్న వాళ్ళంతా నారాజ్ అవ్వడం తప్ప పార్టీ.. ఖుషీ చేసింది లేదు. దీంతో అసహనం పెరిగిపోయిన కొందరు అయితే సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: BSBD Account Benefits: జీరో బ్యాలెన్స్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..
అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తారో..? లేదో క్లారిటీ ఇస్తే… వాటి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళయినా సైలెంట్‌గా ఉంటారు కదా..? ఆశలు కల్పించడం ఎందుకు..? నాన్చడం ఎందుకు…. అన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. పని విభజనతో పాటు.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రచారం… ఆర్గనైజేషన్ పర్యవేక్షణ లాంటి అంశాలన్నిటినీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ చూస్తారు. కానీ ఇప్పటి వరకు ఆ పదవుల భర్తీ విషయంలో అస్సలు క్లారిటీ లేదు. డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చేసిన ప్రకటన అక్కడికే పరిమితం అవుతుందా లేక ఈసారన్నా పని పూర్తి చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.