ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం నడుస్తుంది.. యుద్ధంలో ప్రజలు గెలవాలని రాహుల్ గాంధీ కోరుకున్నారు.. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్లు అని ఆయన ప్రకటించారు. ప్రజలు కలలు కన్న తెలంగాణ రాకుండా పోయింది.. తెలంగాణ వచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదు.. భయం భయంగా బ్రతుకల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రజలకు న్యాయం జరుగుతుంది.. ఖమ్మంలో ఏమి మాట్లాడాలన్న భయంగా ఉంది.. రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడడానికి ఖమ్మం నుంచే ప్రారంభం కావాలి.. ఖమ్మం కాంగ్రెస్ గెలుపునకు పునాది కావాలి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
Read Also: Thatikonda Rajaiah: అధిష్ఠానానికి కట్టుబడి నా వంతుగా గెలిపిస్తా..
ఇక, తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఉదయం ఒక్క మాట రాత్రి ఒక్క మాట మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు అని ఆయన విమర్శించారు. ప్రజలు సుభిక్షంగా వుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. భట్టి విక్రమార్క నాకు పొంగులేటికి టిక్కెట్లు ఇప్పించారు అని ఆయన తెలిపారు. న్యాయం కోసం న్యాయవాదులు రాజకీయ నాయకుల వద్దకు వస్తున్న దుస్థితి ఖమ్మంలో జరుగుతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాప పరిహారం మీరే చేసుకోవాలి.. చారిత్రక మైన ఎన్నికలు.. తెలంగాణ కోరుకున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష..
తెలంగాణ ప్రజలు తీసుకున్నారు అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Read Also: అందాలతో మైమరిపిస్తున్న నిక్కీ తంబోలి
అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు పాలేరులో రాబోయేది కురుక్షేత్ర యుద్ధం.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపడం ఖాయం అని ఆయన వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.. నేను కూడా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయటం ఖాయం.. పాలేరు నియోజకవర్గంలో ఇంత వరకు ఎవ్వరికీ రాని మెజార్టీతో నన్ను గెలిపించాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.