రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు అహంకారంగా మాట్లాడుతున్నారు.. గుడుంబా ప్యాకేట్ ఇస్తే ఓటు వేస్తారని అంటున్నారు.. అవమానకరంగా అవహేళన చేస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు. డిసెంబర్ 3 తరువాత కేసీఆర్ ఆర్ఎస్, సోనియా గాంధీ, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతాయి.
సూర్యాపేటలో బీజేపీ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అని ఆయన ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఖమ్మం నేతలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులపై ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యం పక్కనున్న కర్ణాటక పరిస్థితులే.. కాంగ్రెస్ అంటేనే ఝూటాకోర్ పార్టీ.. 2009లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అంటూ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసోళ్లను నమ్మితే మోసపోతాం.. కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోంది.. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం దండగ చేస్తే.. కేసీఆర్ పండుగ జేసిండు అని ఆయన అన్నారు.
ఈ జెండా పిడికెడు మందితో 24 ఏళ్ల క్రితం ఎత్తాము.. 15 ఏళ్ల పోరాటంతో తెలంగాణ ఉప్పెనై కదిలింది.. కాంగ్రెస్ దోకా చేసింది.. కేసీఆర్ శవ యాత్ర జరిగిన భయ పడకుండా ఆమరణ దీక్ష చేశాను అని సీఎం కేసీఆర్ తెలిపారు.
లోకల్, నాన్ లోకల్ అనే వారికి ఒకటే సమాధానం చెబుతున్నాను అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. బ్రోకర్ ముఖ్యమంత్రి కొడుకు సిరిసిల్లలో లోకల్ అయినప్పుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకుగా నేను లోకల్ నే అవుతాను అని ఆయన వెల్లడించారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. అదే సోషల్ మీడియాలో సమాధానాలు చెప్పండి.. గతంలో సిరిసిల్లకు ఇప్పటి సిరిసిల్లకు తేడాను సోషల్ మీడియాలో ప్రచారం చేయండి.. సిరిసిల్ల ఒకప్పుడు ఉరిసిల్లగా ఉండే.. కానీ, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో తెలపండి అని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానన్న రేవంత్ రెడ్డిని ఈ విషయంలో మెచ్చుకుంటున్నాను రేవంత్ రెడ్డి మొండోడు, ధైర్యవంతుడు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులపై అమ్ముడు పోయారని బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ పనికి మాలినవని ఏనుగులు పోతుంటే కుక్కలు చాలా మొరుగుతాయని వాటిని పట్టించుకోకూడది మంత్రి తలసాని అన్నారు. మాటెత్తితే జైశ్రీరామ్ అనే మీరు అదే శ్రీరాముడుపై ఒట్టేసి మీరు చేస్తున్న ఆరోపణలు రుజువు చేసుకుంటారా అని సవాల్ చేశారు.