బాపట్లలో సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా అంబేద్కర్ సర్కిల్ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపిస్తాను అని లోకేష్ అన్నాడు.. జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు అని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి భయపడే టైపు కాదు.. దేశాన్ని శాసించిన సోనియాగాంధీని లెక్కచేయని మగాడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
Read Also: Constable Dismissed: వాహనాల తనిఖీ పేరుతో 18.50 లక్షలను కాజేసిన కానిస్టేబుల్
పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంటే ప్రతిపక్షాలకు కడుపులో మండుతుంది అని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఒకడు యూట్యూబ్ లో చూసి ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవచ్చు అంటాడు.. వాడి పిల్లలు యూట్యూబ్ చూస్తే నేర్చుకుంటున్నారా , వాడు యూట్యూబ్ చూసే సినిమాలు చేస్తున్నాడా?.. ప్రతిపక్షాలన్నీ ఏకమైన కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేవు జగన్మోహన్ రెడ్డి కటౌట్ పట్టుకొని ప్రజల్లోకి వెళతాం అని ఆయన వెల్లడించారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏ పార్టీ చేయని విధంగా బీసీలకు పెద్దపీట వేసిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి ఐదుగురిని రాజ్యసభకు పంపిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు.
Read Also: Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఏపీలో మూతపడ్డ ఆలయాలు..
ఇక, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ దళితులను జైళ్లకు పంపితే జగన్మోహన్ రెడ్డి దళితులను పార్లమెంటుకు పంపారు. పేద పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత జీవితాలు అనుభవించాలంటే 20 సంవత్సరాల పాటు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తీరాలి అని ఆయన అన్నారు. ఆదమరిస్తే ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే మన పిల్లల జీవితాలు మన జీవితాలు తిరిగి వెనక్కు వెళ్లిపోతాయి.. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వారి అవకాశాల కోసం వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మన కోసం వచ్చారు పేద బడుగు బలహీన వర్గాల కోసం వచ్చారు అని ఎంపీ నందిగాం సురేష్ పేర్కొన్నారు. అంతు చూస్తా అన్నవాడు జైలుకు పోయాడు భయపెడతా అన్న కొడుకు భయపడి ఢిల్లీ పారిపోయి విగ్గురాజు దగ్గర దాక్కున్నాడు అంటూ ఆయన మండిపడ్డారు.