జగన్ మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపిస్తాను అని లోకేష్ అన్నాడు.. జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు అని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి భయపడే టైపు కాదు.. దేశాన్ని శాసించిన సోనియాగాంధీని లెక్కచేయని మగాడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. తిరిగి రేపు వేకువజామున 3:15 గంటలకు ఆలయ తలుపులను అర్చకులు తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేసాం.. రేపు ఉదయం ఆలయ తలుపులు తెరిచి శుద్ది చేస్తారు.
నెల్లూరు జిల్లా కావలిలో ఆటోనగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు డిమాండ్ చేశారు. నిరంతరం రాత్రి పగలు ప్రయాణీకుల రవాణా సౌకర్యాన్ని అందించేందుకు విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఈ మధ్య దాడులు పెరగడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త మ్యానిఫెస్టోతో రాబోతుంది అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం 2024 ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమైంది.. గుంటూరులో రేపు జరిగే ఓబీసీ సంఘాల సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
దోచుకో.. దాచుకో అనుకున్నందుకు చంద్రబాబు జైలు పాలయ్యాడు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మేం రెండు ఎకరాల్లో ఆదాయాన్నే తిన్నాము.. ప్రజల సొమ్ము దోచుకో లేదని నారా భువనేశ్వరి దేవుడి మీద ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. యాదవులను టీడీపీ ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంది.. నారా చంద్రబాబు, నారా లోకేశ్, దత్తపుత్రుడిని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం అని ఆయన వ్యాఖ్యనించారు.
జైల్లో ఉన్న చంద్రబాబుకు 50 రోజుల శుభాకాంక్షలు హర్ష ధ్వానాలతో చెప్పాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలను కోరారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దొరికిన దొంగ అంటూ విమర్శించారు.
వైసీపీ పాలనలో అరాచకం పెచ్చుమీరుతోంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. హారన్ కొట్టడం కూడా నేరమే అని చట్టం చేస్తారేమో?.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడం లేదు.. అధికార దుర్వినియోగం, అందుకు తోడైన అహంకారంతో వైసీపీలో ప్రతి స్థాయి నాయకుడు ప్రజల మీదా, ఉద్యోగుల మీదా జులుం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు టీడీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రావత్ కు లేఖ రాసినా వివరాలు ఇవ్వకపోవడంతో మంత్రి బుగ్గనకు ఆయన లేఖ రాశారు.
ముసాయిదా ఓటర్లు జాబితా విడుదల నేపథ్యంలో ఓటర్ల జాబితాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఓటర్ల జాబితా అంశాలపై ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక ఇంఛార్జ్ నియామకం చేసేందుకు యోచిస్తుంది.
శ్రీకాళహస్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఇన్ చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వర్సెస్ శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్ కుమార్ల మధ్య సవాళ్లు కొనసాగుతుంది. అయితే, కమ్మకోత్తుర్ లో రూరల్ సీఐ టీడీపీ నాయకులను బూతులు తిట్టి కొట్టడంతో తీవ్ర వివాదం అవుతుంది.