కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. గత నెల రోజులుగా అభ్యర్థుల పేర్ల ప్రకటనకు రేపు మాపు అంటూ ఊరిస్తూ.. నేడు తొలి జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఇవాళ ప్రకటించనుంది.
తిరుమలలో శ్రీ శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలకు నిన్న (శనివారం) సాయంత్రం శాస్త్రోక్తంగా టీటీడీ అర్చకులు అంకురార్పణ చేపట్టారు.