బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతితో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించారు. 43 మందితో బీఎస్పీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్ చేశారు.
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.. నితీ, నిజాయితీ బీఆర్ఎస్ ఎజెండాలో లేదు.. యువత నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పటం ఖాయం.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
కొత్త ప్రభాకర్ రెడ్డికి గజ్వేల్ లో ప్రాథమిక చికిత్స అందించాం.. రక్త స్రావం ఎక్కువ అవుతోంది.. హైదరాబాద్ తీసుకెళ్ళమని డాక్టర్లు చెప్పారు అని చెబుతూ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనైయ్యారు. అన్నారు. భౌతిక దాడులకు, హత్యా యత్నాలకు దిగడం సరైంది కాదు.. దాడి చేసిన వ్యక్తి ఎవరు... ఎందుకు చేశాడు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. హత్యయత్నం చేసిన గడ్డం రాజుపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగిందని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు.
ఘట్కేసర్, మహేశ్వరం పోలీసుల బృందం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి మాదక ద్రవ్యాల రాకెట్ ఛేదించారు.. ఈ కేసులో డ్రగ్ ఫెడ్లర్ ను అరెస్ట్ చేయడంతో పాటు 710 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.
బీఆర్ఎస్ పథకాలు బీజేపీ- కాంగ్రెస్ నాయకులు కూడా పొందుతున్నారు.. కేసీఆర్ కు ఓటేయకుంటే నష్టం పోతాం.. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవు.. రైతు సంక్షేమానికి పాటుపడ్డ ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్.. రైతాంగానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాలి అంటూ జోగు రామన్న డిమాండ్ చేశారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడమే నా ప్రధాన ఎజెండా.. అందు కోసమే హుజురాబాద్, గజ్వేల్ లో పోటి చేస్తున్నాను తెలిపారు. కేసీఆర్ మధ్యం, డబ్బు సంచులను నమ్ముకున్నాడు.. హుజురాబాద్ లో ఎమ్మెల్యే ప్రోటో కాల్ విస్మరించారు అని ఆయన ఆరోపించారు.
నీకు ఎందుకు ఓటు వేయాలి అని సీఎం కేసీఆర్ కి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సవాల్ విసిరారు. తెలంగాణలో మహిళలకు రక్షణ ఉందా?.. అత్యాచారం చేసిన వాళ్ళకు అధికార పార్టీ నేతలు అండగా ఉన్నారు.. బాల్య వివాహాలు జరుగుతుంటే ఏం చేస్తోంది
అధికారంలో ఉన్న దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం నడుస్తుంది.. యుద్ధంలో ప్రజలు గెలవాలని రాహుల్ గాంధీ కోరుకున్నారు.. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్లు అని భట్టి విక్రమార్క ప్రకటించారు.