తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రచారానికి మరో నాలుగు రోజుల సమయం ఉండటంతో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారంలో దూకుడు పెంచింది. ఇందులో భాగాంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పలువురు బీజేపీ జాతీయ నేతల ప్రచారం చేయనున్నారు.
Read Also: Israel Palestine Conflict: 50 మంది బందీలకు బదులుగా 150 మంది పాలస్తీనా ఖైదీలు.. కుదిరిన డీల్
ఇవాళ సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దర్శించుకోనున్నారు. ఇక, 6 గంటలకు చార్మినార్ బెలా క్రాస్ రోడ్ లో బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అలాగే, 7 గంటలకు ముషీరాబాద్ చౌరస్తాలో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ మాట్లాడనున్నారు. దీంతో పాటు బెంగళూర్ సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య సైతం పలు చోట్ల ప్రచారం చేసేందుకు తెలంగాణకు వచ్చారు. మరో వైపు ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ పఠాన్ చెరువు, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుండగా.. కేంద్ర మంత్రి అర్జున్ ముండా వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్ లో ప్రచారం నిర్వహించేందుకు వస్తున్నారు. అలాగే, వరంగల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఇక, జహీరాబాద్ లో ఎన్నికల ప్రచారం లో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పాల్గొనున్నారు. మరో వైపు మల్కాజ్ గిరి లో ఇంటింటి ప్రచారంలో తమిళ్ నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాల్గొననున్నారు.