BRS Election Campaign: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇవాళ ప్రచారంలో భాగంగా 4 నియోజకవర్గాల్లో గులాబీ బాస్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూర్, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నియోజక వర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
Read Also: Molestation In Metro: బెంగళూరు మెట్రోలో యువతిపై లైగింక వేధింపులు.. గోర్లతో రక్కిన రాక్షసుడు
ఇక, నేటి నుంచి ఈ నెల 28 వరకు కేసీఆర్.. మరో 23 బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో గులాబీ దళపతి పాల్గొనలేదు.. ఈ నెల 25న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా కేసీఆర్.. అక్టోబర్ 15 నుంచే ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించారు.. ఇప్పటి వరకు 74 సభల్లో ఆయన పాల్గొన్నారు.
Read Also: Guntur Kaaram Leak: ఇదేమి అభిమానం… వదిలితే సినిమానే లీక్ చేసేలా ఉన్నారు…
అయితే, పార్టీ అభ్యర్థుల తరఫున గులాబీ బాస్ కేసీఆర్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని పరిస్థితులను వివరిస్తూ.. అప్పటి, ఇప్పటి పరిస్థితులపై గ్రామాల్లో చర్చ జరగాలని పదేపదే ప్రజలకు తెలియజేస్తున్నాడు. అయితే, తొలుత సభల్లో సాధారణంగానే ప్రసంగిస్తూ వచ్చిన కేసీఆర్.. క్రమంగా తన ప్రసంగాల్లో వేడిని పెంచుతూ ముందుకు సాగుతున్నారు.