తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు. జనసేనాని బీజేపీ పార్టీతో పొత్తులో భాగంగా నేడు వరంగల్ జిల్లాలో ప్రచారం చేయబోతున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన కూడా పలు చోట్ల ఎన్నికల బరిలో నిలిచింది. అయితే, జనసేన మొత్తం 32 స్థానాల్లో పోటీ చెయ్యాలి అనుకుంది.. కానీ, కేవలం 11 స్థానాలను బీజేపీ ఫైనలైజ్ చెయ్యడంతో.. ఆ స్థానాల్లో తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టింది. ఇక, తమ అభ్యర్థుల కోసం మాత్రమే కాకుండా.. బీజేపీ అభ్యర్థుల తరపున కూడా జనసేన అధినేత ప్రచారంలోకి దిగుతున్నారు.
Read Also: Astrology: నవంబర్ 22, బుధవారం దినఫలాలు
కాగా, ఇవాళ వరంగల్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. మరో వైపు రేపు కూడా ఆయన కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. అయితే, నేటి మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ లో జరిగే బహిరంగ సభకు పవన్ వెళ్తారు. అలాగే గురువారం ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట, ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు దుబ్బాకలో పర్యటిస్తారు. అయితే, పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమా షూటింగ్స్ చేసుకుంటునే.. మరోవైపు రాజకీయాలూ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రచారానికి భారీగా తరలి వచ్చేందుకు జనసేన కార్యకర్తలు, అభిమానులూ సిద్ధమయ్యారు.