విశాఖపట్నంలో యువగళం విజయోత్సవ సభ కేవలం సీఎం జగన్ ని తిట్టటానికే ప్రాధాన్యత ఇచ్చారు అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పాదయాత్రలోని అనుభవాలను, ప్రజల సమస్యలను కనీసం సభలో చెప్పలేదు.. సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు.. ఇటు పవన్ ని తీసుకు రావటానికి పడిన పాట్లు అందరూ గమనించారు.
పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య అధినీయం బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. అయితే, ఈ మూడు బిల్లులు ఇవాళ రాజ్యసభ ముందు ప్రవేశ పెట్టనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తిరుమల తిరుపతిలో రేపు సర్వ దర్శనం భక్తులకు జారి చేసే టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. ఇక, రేపు మధ్యహ్నం నుంచి సర్వ దర్శనం భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది.
ఇవాళ ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. మార్చ్ నెలలో నిర్వహించే వార్షిక తెప్పోత్సవాల టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
ఆంధ్ర ప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యతకు నిబంధనలకు నీళ్లు వదిలారు.. స్మార్ట్ సిటీ పనుల నిర్వహణకు, ప్రభుత్వానికి సంబంధం ఉండదు.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయాలు తీసుకుంటారు.
టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్ తన తదుపరి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. జనవరి 2024 చివరి వారంలో టాటా పంచ్ ఈవీని భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిసింది.