Tirumala: నేడు మార్చ్ నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్ల విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. మార్చ్ నెలలో నిర్వహించే వార్షిక తెప్పోత్సవాల టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఇక, శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శనం టికెట్ల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అంగప్రదక్షిణం టోకెన్లు డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. అలాగే, శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం, గదుల కోటాను డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్ల కోటాను డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ రిలీజ్ చేయనుంది.
Read Also: Crime News: వారం రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. గుర్తించలేని స్థితిలో తల్లి, సోదరుడు!
Also Read
అలాగే, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ 25న 10 గంటలకు భక్తులకు అందుబాటులో తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు అందుబాటులో ఉంచనుంది. తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను సైతం రిలీజ్ చేయనుంది. ఇక, డిసెంబరు 27న ఉదయం 11 గంటలకు.. తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటా, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో టీటీడీ ఉంచుతారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!