పార్లమెంట్ నుంచి 146 మంది పార్లమెంట్ సభ్యులను స్పీకర్ ఓంబిర్లా సస్పెండ్ చేశారు. దీంతో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా కూటమి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వామపక్షాలు, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు ప్రకటించాయి.
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చి కారు ఇసుక లారీ ఢీ కొన్నాయి.. కారులో ప్రయాణిస్తున్న ఏటూరు నాగరంకు చెందిన నలుగురు మృతి చెందారు..
వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ రెడీ అవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. గత వారం పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే చలి జనం వణికిపోతున్నారు.
న్ను గెలిపించిన గిరిజనులకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదా.. పర్యాటక శాఖా మంత్రి హోదాలో గిరిజనులతో డాన్స్ చేసిన రోజా దీని కోసం నోరు ఇప్పలేదే.. పుట్టినరోజు సందర్భంగా జగన్ కు బుద్ధి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు.
నాపై పని గట్టుకుని విమర్శలు చేస్తున్నారు.. పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే.. మన పిల్లలు దేశంలోనే అత్యత్తమంగా ఉండాలి.. గత పాలనలో స్కూళ్లు ఎలా ఎన్నాయి.. ఇప్పుడెలా ఉన్నాయి.. తొలిసారిగా ప్రైవేట్ స్కూల్స్ తో ప్రభుత్వ స్కూల్స్ తో పోటీ పడే పరిస్థితి వచ్చింది- సీఎం జగన్
టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఎక్కడ స్టార్ట్ చేశాడు ఎక్కడ పూర్తి చేశాడో అవగాహన లేదు అంటూ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియతమ నేత సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. అయితే, మార్కాపురంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాజమంత్రి జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధం అని కోమటిరెడ్డి చెప్పారు.
జాబు రావాలంటే బాబు రావాలని అబద్ధాలు చెబుతున్నారు అంటూ కేఏ పాల్ అన్నారు. 60 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారు.. చంద్రబాబుకు బిల్ క్లింటన్, బిల్గేట్స్ ను నేనే పరిచయం చేశా.. రైతులకు రుణమాఫీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి మహిళలకు ఉచిత బస్సు వైద్యం వీటన్నిటి గురించి వాగ్దానాలు చేస్తున్నారు.