Parliament Session: నేడు రాజ్యసభ ముందుకు కీలకమైన మూడు బిల్లులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య అధినీయం బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయితే, ఈ మూడు బిల్లులు ఇవాళ రాజ్యసభ ముందు ప్రవేశ పెట్టనున్నారు. అయితే, ఈ సభలో కేంద్ర ప్రభుత్వానికి తగిన బలం లేదు.. దీంతో మెజారిటీ సభ్యుల నుంచి ఆమోదం పొందితేనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు.
Read Also: Bomb Blast: మహబూబాబాద్‌లో అర్ధరాత్రి బాంబ్ బ్లాస్టింగ్.. 25 ఇళ్లకు బీటలు!
Also Read
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ఇక, ఆ తరువాత ఈ మూడు బిల్లులు చట్టంగా మారనున్నాయి. వీటిని ప్రస్తుతం ఉన్న ఐసీసీ, సీఆర్పీసీ చట్టాలలో ప్రత్యేక యాక్ట్‌గా పొందు పర్చారు. ఈ చట్టాలు నేరస్తులను శిక్షించడానికి కాదని.. బాధితులకు న్యాయం జరగడానికని కేంద్రం తెలిపింది. దేశంలో ఏదైనా అసాంఘీక ఘటనలు తలెత్తితే వేగంగా న్యాయం చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడుతాయని తెలిపారు. డిజిటల్, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న ఎవిడెన్స్ లను సైతం సాక్ష్యంగా పరిగణలోకి తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏదైనా నేరాలకు పాల్పడి ఇతర దేశాలకు పారిపోతే 90 రోజుల లోపు కోర్టు ముందు లొంగిపోయేలా ఈ చట్టాల్లో పొందుపర్చారు. ఇలా హాజరు కాని పక్షంలో వారి తరఫున ప్రభుత్వ న్యాయవాదిని పెట్టి తీర్పు వెల్లడిస్తారు. అలాంటి వారిని నేరస్తులుగా భావించి ఏ దేశంలో ఉన్నా తీసుకొచ్చి ఉరి శిక్ష వేస్తారు.
Read Also: Sandeep Reddy Vanga: ఏంటీ… ఈ ఇంటర్వ్యూ CGనా? మేము ఒరిజినల్ అనుకున్నామే
అలాగే, ఏదైనా కేసుల్లో దర్యాప్తు సంస్థలు చేపట్టే సోదాల్లో వీడియోగ్రఫీ చేయాలనే విషయాన్ని ఈ చట్టాల్లో పొందుపరిచారు. ఏదైనా తప్పు చేసినప్పటికీ నిరాధారంగా అరెస్ట్ చేసి పోలీ స్టేషన్‌లో పెట్టుకోవడానికి వీలు లేదంటూ వెల్లడించింది. ఆర్ధిక నేరస్తుల ఆస్తులను వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు ఆ డబ్బును మళ్లించేలా కొత్త ప్రతిపాదనను సైతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఏదైనా నేరాల్లో పట్టుబడ్డ వాహనాలను కోర్టు ద్వారా 30 రోజుల్లో అమ్మేయాలనే సంచలన నిర్ణయం తీసుకొచ్చారు. ఏడేళ్ల జైలు శిక్ష పడిన కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు సంస్థల ప్రమేయం తప్పనిసరి చేస్తూ ఈ మూడు కీలక బిల్లులను మోడీ సర్కార్ ప్రవేశ పెట్టింది.
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?