తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కఠోర దీక్షతో తెలంగాణాను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలి అని రేవంత్ రెడ్డిసూచించారు.
రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు దేశంలో వాక్ స్వాతంత్య్రం అంతమైందని, యువత నిరుద్యోగులుగా మారుతున్నారని అన్నారు. ఆరు రోజుల క్రితం కొంత మంది యువకులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి పొగను విడుదల చేశారు.. దీంతో బీజేపీ ఎంపీలంతా పారిపోయి ఊపిరి పీల్చుకున్నారు అని రాహుల్ గాంధీ చమత్కరించారు.
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. ఇందుకు కాంగ్రెస్ కూడా సపోర్టు ఇస్తుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు రాహుల్ ఫోన్ చేశారు.
ఈ ఏడాది 63శాతం నేరస్తులకు శిక్షలు పడ్డాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు.. గత ఏడాదితో పోల్చితే 2 శాతం క్రైమ్ కేసులు పెరిగినట్లు చెప్పారు.
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింగరేణి లో గుర్తింపు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాగా వేయటానికి అటు ఏఐటీయూసీ ఇటు ఐఎన్టీయూసీ పావులు కదుపుతున్నాయి.
క్రిస్మస్, నూతన సంవత్సరానికి ముందు వ్యాపార వినియోగదారులకు గుడ్ న్యూ్స్.. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను కంపెనీలు తగ్గించాయి. ఇవాళ్టి నుంచి కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39.50 తగ్గించాయి.
గత కొన్నేళ్లుగా డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం చైనా గూఢచారి బెలూన్ కుంభకోణంతో పాటు తైవాన్‌కు సంబంధించి ఇరు దేశాలు ముఖాముఖిగా విమర్శలు గుప్పించుకున్నాయి.
పార్లమెంట్లో విపక్ష పార్టీలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెన్షన్ చేయడంతో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ధర్నా నిర్వహించనున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా నగరంలో పోలీసులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరో వైపు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నేడు ఎట్ హోం కార్యక్రమం దృష్ట్యా కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.