Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచుతో కప్పి ఉంటుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలిగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈసారి ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాల్లోనూ 2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలు చోట్ల 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు పడిపోయాయి. సాధారణంగా ఈ టైంలో 26 నుంచి 28 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఉండాల్సింది.. కానీ, ప్రస్తుతం 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గిపోయాయి. ఉపరితల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరుగె అవకాశం ఉంది.
Read Also: SA vs IND: దక్షిణాఫ్రికా, భారత్ మూడో వన్డే నేడు.. తెలుగు ఆటగాడిపై వేటు!
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో వాతావరణం చల్లగా ఉంటోంది. రాత్రిపూట కాకుండా పగలు కూడా చలిగాలులు వణికిస్తున్నాయి. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని కారణంగా ఇవాళ, రేపు తెలంగాణలో పొడి వాతవరణం ఏర్పాడే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు మాత్రం చలి విషయంలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
- Tags
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!