మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిరంతరం దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజేగౌడతో పాటు ఆయనకు సంబంధించిన కొన్ని సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ఉదయం సోదాలు చేసింది.
రామ మందిర ఘనత భారతీయ జనతా పార్టీదేనని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 'రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రామమందిరం తాళం తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు.
బిల్కిస్ బానో కేసులో భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది నిందితుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మాత్రం ఆదివారం రాత్రి చైనా వెళ్లారు.
ఇవాళ ఉదయం భారత్-మాల్దీవుల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మాల్దీవుల రాయబారిని పిలిపించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్ను పిలిపించింది.
పాఠశాలకు దారి వెలుగుకు మార్గం.. సావిత్రి బాయి ఫూలే దేశంలోని స్త్రీలు, షెడ్యూల్డ్ కులాలలో విద్యా జ్యోతిని మేల్కొల్పారు అని వ్యాఖ్యనించారు. వారి వల్లనే మన సమాజంలో షెడ్యూల్డ్ కులాలకు చోటు దక్కింది అంటూ చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్ కు వ్యతిరేకంగా అమెరికాలోని వైట్ హౌస్ ముందు బలూచిస్థాన్ వలసదారులు ఆందోళనకు దిగారు. గత 75 ఏళ్లలో బలూచిస్థాన్లో జరిగిన అకృత్యాలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని బలూచిస్థాన్ అసెంబ్లీ మాజీ స్పీకర్ వహీద్ బలోచ్ నిరసన వ్యక్తం చేశారు.
నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు వికాస్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో వర్చువల్ గా మాట్లాడబోతున్నారు. వికాస్ భారత్ సంకల్ప యాత్రతో పాటు నడుస్తున్న ప్రచార రథాల్లో ప్రధాని నేరుగా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ యదువంశ్ తెలిపారు.
మధ్యప్రదేశ్లోని సాగర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 13 ఏళ్ల బాలిక మరణించింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు టార్పాలిన్ మీద దూకింది కానీ ఆమె బరువు కారణంగా ప్లాస్టిక్ టార్పాలిన్ చిరిగిపోవడంతో సీసీ రోడ్డు మీద పడిపోవడంతో బలంగా తలకు గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యల తర్వాత మాల్దీవులపై భారత్ ఆగ్రహం తగ్గుముఖం పట్టడం లేదు. సామాన్య ప్రజలతో పాటు భారతదేశంలోని ప్రముఖ ట్రావెల్ కంపెనీలు కూడా మాల్దీవులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ లోని అతిపెద్ద ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్ (EaseMyTrip) మాల్దీవులకు తన అన్ని విమాన బుకింగ్లను క్యాన్సిల్ చేసింది.