ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ సాగుతుంది.. ధరణితో పాటు 317 జీవో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశాలను పరిశీలిస్తున్నామని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు పులుల మరణాలతో అటవీ శాఖ అప్రమత్తం అయింది. కాగజ్ నగర్ మండలం దరిగాం శివారు అటవీ ప్రాంతంలో మిగతా పులుల జాడ కోసం ఆరా తీస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో భారతీయ పర్యాటకులు బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నారు. ఈ సంఘటనల మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా నుంచి ఎక్కువ మంది పర్యాటకులను తన దేశానికి పంపే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ ఇవాళ్టితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించని వారు ఎవరైనా ఉంటే.. వెంటనే చెల్లించడం మంచిదన్నారు. ఎందుకంటే.. మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చని పేర్కొన్నారు.
కాలేజీలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, సీఎంకి వందలాది మంది విద్యార్ధినులు లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతుంది. హరియాణాలోని సిర్సాకు చెందిన 500 మంది మహిళా కళాశాల విద్యార్థినులు చౌదరి దేవిలాల్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ లేఖ రాశారు.
బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో తన నాలుగేళ్ల కొడుకును గోవాలోని ఓ హోటల్లో హత్య చేసింది. ఆమెను కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం సమీపిస్తున్న తరుణంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులలో ఉత్సాహం పెరుగుతోంది. అయితే, ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తమ తమ దేశాల్లో జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మే 26న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ షాహీ మసీదు ఈద్గా కమిటీ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారించనుంది.
ప్రధాని నరేంద్ర మోడీపై, భారత పౌరులపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజుకు తీరని కష్టాలను తెచ్చిపెట్టింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ప్రతిపక్షాలు ఇప్పుడు అధ్యక్షుడు ముయిజ్జును అధికారం నుంచి తప్పించే పనిలో పడ్డాయి.
చైనా పర్యాటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ భారత పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, మాల్దీవులపై తాము రెచ్చగొట్టడం గానీ, ఒత్తిడి చేయడం గానీ చేయలేదని ఇప్పటికే చైనా స్పష్టం చేసింది.