రామ మందిరంపై బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలకు ఆదివారం డెహ్రీ చేరుకున్న ఆయన మాట్లాడుతూ.. గుడి దారి మానసిక దాస్య బాట అని అన్నారు. పాఠశాలకు దారి వెలుగుకు మార్గం.. సావిత్రి బాయి ఫూలే దేశంలోని స్త్రీలు, షెడ్యూల్డ్ కులాలలో విద్యా జ్యోతిని మేల్కొల్పారు అని వ్యాఖ్యనించారు. వారి వల్లనే మన సమాజంలో షెడ్యూల్డ్ కులాలకు చోటు దక్కింది అంటూ చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రతి గ్రామానికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. విద్య అనేది మీ పిల్లల భవిష్యత్ ను మారుస్తుంది.. బాబా అంబేద్కర్ యొక్క విశ్వాసాలను అనుసరించి రామ మందిరానికి సంబంధించిన అక్షతలను ఇచ్చేవారిని నివారించండి అని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: Budget 2024 : తుది దశకు చేరుకున్న బడ్జెట్ సన్నాహాలు..
ఇక, 19వ శతాబ్దంలో అంటరానితనం, సతీసహగమనం, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాల లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా సావిత్రి బాయిపూలే తన భర్తతో కలిసి పని చేశారని రెవెన్యూ మంత్రి అలోక్ మెహతా పేర్కొన్నారు. జ్యోతిబా ఫూలే మరణానంతరం, సావిత్రి బాయి చేసిన పోరాటం వల్లనే నేడు మన సమాజంలో స్త్రీల పట్ల గౌరవం పెరిగింది అని రెవెన్యూ శాఖ మంత్రి మెహతా చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటి పిచ్చి వారి మాటలను నమ్మి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి అని తెలిపారు.