సుప్రీం కోర్టులో సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి నిన్న (శుక్రవారం) రెండు విస్కీ బాటిళ్లను పెట్టడంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ షాక్ అయ్యారు.
బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు.. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ లాంటి ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.
యూఎస్ లోని ఒరెగాన్లోని ఒక ఆసుపత్రిలో ఓ నర్సు రోగులకు ఇచ్చిన మందులను దొంగిలించి వాటికి బదులుగా డ్రిప్ వాటర్ నింపింది. దీంతో 10 మంది రోగులు మృతి చెందారు.
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ప్రసాదానికి కొరత ఏర్పాడింది. శబరిమల ప్రసాదాన్ని ప్రత్యేక డబ్బాలలో ఇస్తారు.. అయితే, ఇప్పుడు ఆ డబ్బాలకు కొరత ఏర్పడింతో.. ప్రసాదంపై ట్రావెన్ కోర్ దేవస్థాన్ బోర్డు ఆంక్షలు విధించింది.
కన్నడ మాతృ భాషా సమగ్రాభివృద్ధి (సవరణ) ఆర్డినెన్స్కు కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, సంస్థలకు ఏర్పాటు చేసే 'సైన్బోర్డ్లు' అలాగే నేమ్ప్లేట్లలో 60 శాతం కన్నడ భాషను ఉపయోగించాల్సి ఉంటుంది అని సిద్ధరామయ్య సర్కార్ వెల్లడించింది.
శీతాకాలంలో విపరీతమైన చలితో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే, నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లను చలి తీవ్రత వణికిస్తోంది. 25 ఏళ్ల తర్వాత స్వీడన్, ఫిన్లాండ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
ఈ రోజు సోషల్ మీడియాలో #Melodi ట్రెండ్ అవుతోంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని బీచ్ లో నడుస్తున్న ఫోటోను ప్రజలు ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటున్నారు. ఈ ఫోటోలో మెలోనీ బీచ్ను శుభ్రం చేస్తూ కనిపించింది.. నేను హఠాత్తుగా సముద్ర తీరాన్ని ప్రేమించడం మొదలుపెట్టాను అనే ఈ శీర్షికతో ఈ పిక్ వైరల్ అవుతుంది.
ఉత్తరప్రదేశ్లో హలాల్ సర్టిఫికేట్పై నమోదైన కేసులో హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.