లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి నుంచి మహారాష్ట్రలో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? అనే విషయం నేడు కాంగ్రెస్, శివసేన (యుబీటీ), ఎన్సీపీ సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్సైట్ పేరులో మరోసారి మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ వెబ్సైట్ పేరు thirupathibalaji.ap.gov.in అని కనిపించేది.. కానీ, దానిని ttdevasthanams.ap.gov.in గా మారుస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ప్రధాన మంత్రితో పాటు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమవుతారని అధికారులు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవుల ఇస్తున్నట్లు పేర్కొనింది. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు హాలీడేస్ ఇచ్చింది.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఇవాళ పోలియో టీకాలు వేసే కార్మికులకు భద్రత కల్పించేందుకు వెళ్లిన పోలీసులను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ మరోసారి భారత్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అయోధ్యలో రామ మందిరంలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగే రోజు అమృత్సర్ నుంచి అయోధ్య వరకు ఎయిర్‌పోర్టులు అన్ని మూసివేయాలని పిలుపునిచ్చాడు.
ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనను మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు ఎగతాళి చేయడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ వివాదంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఇవాళ్టి నుంచి అయోధ్యలో రామోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మన దేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే 35 వేలకు పైగా కళాకారులు పాల్గొనబోతున్నారు. నేటి నుంచి రామ కథా పార్కులో రామకథ స్టార్ట్ అవుతుంది.