బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఆగస్టు 2022లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో జీవిత ఖైదు పడిన మొత్తం 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది.
నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సమావేశం అవుతుంది. కేబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 17 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చెయ్యాలనే ప్లాన్ చేస్తుంది.. తద్వారా పథకాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దీనిపై కూడా నేటి మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తికి వేలంలో ఊహించని రేటు వచ్చింది. కనీస ధర 15 వేల రూపాయలుగా నిర్ణయించగా.. ఏకంగా 2 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ఆ ప్లాట్ ను పునరుద్ధరించి సనాతన ధర్మ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్‌లో నాయకత్వ అంశంపై చాలా ఏళ్లుగా చర్చ కొనసాగుతుంది. ఎప్పుడూ మాట్లాడని ఎంపీ సుప్రియా సూలే.. ఈ అంశంపై తొలిసారిగా బహిరంగంగా వ్యాఖ్యానించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించడానికి తనకే ఎక్కువ అర్హత ఉందని ఆమె అన్నారు.
జ్ఞాన్వాపీ ఆర్కియాలజీ సర్వే నివేదికపై వారణాసి కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఏఎస్ఐ సర్వే రిపోర్టును బహిరంగపరచాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించనుంది.
తమ ప్రజలు పని కోసం ఉక్రెయిన్- రష్యా దేశాలకు వెళ్లడాన్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. ఉద్యోగాల కోసం వెళ్తున్న చాలా మంది రష్యా ఆర్మీలో చేర్చుకున్నారని నేపాల్ ప్రభుత్వం ఆరోపిస్తుంది.
భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఒక దాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రముఖ ఆటో కంపెనీ టాటా మోటార్స్ దాని ప్రముఖ కారు టాటా పంచ్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది.
అలాస్కా ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న బోయింగ్ కో. 737 మ్యాక్స్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కిటికీతో పాటు విమానం ఫ్యూజ్‌లేజ్‌లో కొంత భాగం ఎగిరిపోవడంతో పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయబడింది.