lakshadweep: ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనను మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు ఎగతాళి చేయడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ వివాదంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారతీయ దీవుల అందాలను అన్వేషించడానికి ప్రజలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉడిపిలోని అందమైన బీచ్‌లు, పాండిలోని ప్యారడైజ్ బీచ్, అండమాన్‌లోని నీల్, హేవ్‌లాక్ లాంటి ఇతర అందమైన బీచ్‌ల ఫోటోలను నెట్టింట పోస్ట్ చేశారు. పర్యటన రంగాన్ని అభివృద్ది చేస్తే.. మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.. బీచ్ ల దగ్గర అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ప్రస్తుతం భారత్‌కు గొప్ప అవకాశం అని బిగ్ బి చెప్పుకొచ్చారు.
Read Also: Telangana Free Bus: ఒరిజినల్ ఆధార్ ఉండాల్సిందే.. జిరాక్స్ చూపిస్తే బస్సు దిగాల్సిందే..
కాగా, లక్షద్వీప్, మాల్దీవుల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటి వరకు, సినిమా ఇండస్ట్రీతో పాట క్రికెట్ ప్రపంచం వరకు చాలా మంది ప్రముఖులు లక్షద్వీప్‌కు తమ మద్దతును తెలిపారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్ కూడా చేరిపోయారు. ఇప్పటికే ప్రధాని మోడీకి సపోర్టుగా రణవీర్ సింగ్, శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, జాన్ అబ్రహం, ఇతర బాలీవుడ్ ప్రముఖులు ఎక్స్‌ప్లోర్ఇండియన్ ఐలాండ్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ‘విజిట్ లక్షద్వీప్ ప్రచారం’ చేస్తున్నారు.
Read Also: Vijay-Rashmika: ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్?
ఇక, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ చేశారు. దీంట్లో సెహ్వాగ్ భారతదేశంలోని అనేక విభిన్న బీచ్‌ల చిత్రాలను పంచుకోవడంతో పాటు మాల్దీవులపై విమర్శలు గుప్పించారు. ఈ మొత్తం విషయం నుంచి భారత ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని.. పర్యాటక రంగంలో కొంచెం మెరుగుపడటం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహాన్ని అందించగలదని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చారు.
Viru paji .. this is so relevant and in the right spirit of our land .. our own are the very best .. I have been to Lakshadweep and Andamans and they are such astonishingly beautiful locations .. stunning waters beaches and the underwater experience is simply unbelievable ..
हम… https://t.co/NM400eJAbm— Amitabh Bachchan (@SrBachchan) January 8, 2024