మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు.. 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారకుండా భారత్ ను ఏ శక్తి అడ్డుకోలేదని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.
అయోధ్య రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం కాబోతుంది. ఈ ఆలయంలో రాంలల్లా ప్రాణప్రతిష్ట కోసం భారత్ పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్యకు ప్రతి రోజూ మూడు లక్షల మందికి పైగా ప్రజలు సందర్శిస్తారని అంచనాలు వేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షించేందుకు అరాచకవాదులను కాల్చి చంపాలనే ఉద్దేశంలో అప్పటి ప్రభుత్వం కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
టీవీ షోలో అవకాశం ఇప్పిస్తానంటూ యువతి మీద లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బస్సులో పరిచయం అయిన మేకప్ ఆర్టిస్ట్ ని ఓ జూనియర్ ఆర్టిస్ట్ నమ్మించాడు. డెమో కోసం అంటూ యూసుఫ్ గూడా లోని ఓయో రూమ్ తీసుకుని వెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అని పలు మార్లు లైంగిక దాడి చేశాడు.
ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా మాకు మనస్సుంది మార్గం దొరుకుతుంది అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఆరు నూరైనా ఖచ్చితంగా అమలు చేస్తాం.. మేం నాయకులం కాదు సేవకులం.. రెండు పర్యాయాలు నిరుద్యోగులు వేదనకు గురయ్యారు అంటూ కన్నీటి పర్యంతమైన మంత్రి పొంగులేటి.
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ప్రజా యుద్ధనౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను భట్టి విక్రమార్క పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఇవాళ్టి నుంచి ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’కు రెడీ అయింది. 133 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సీఈఓలో పాల్గొనే ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ నేడు ప్రారంభించారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరుతో ప్రజా పాలన అభయహస్తం కోసం దరఖాస్తు చేశారు. ఈ ఫాంలో కొడుకులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల పేర్లు రాసి ఉంచారు. ఇక, కూతురుగా కొండా సురేఖ, అల్లుడుగా శ్రీధర్ బాబు పేర్లు రాసి ప్రజాపాలనలో అభయహస్తంకు సదరు ఆకతాయిలు దరఖాస్తు ఇచ్చారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్టడంతో యాభై మందికి గాయాలు కావడంతో పాటు ఒకరు గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది.