World Heritage Committee: జీ20 తర్వాత భారత్ మరో విజయాన్ని సాధించింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి భారతదేశం మొదటి సారి అధ్యక్షత వహించి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమాచారాన్ని ఇస్తూ, యునెస్కోలో భారతదేశ శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ మాట్లాడుతూ.. 2024 జూలై 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి భారతదేశం మొదటి సారి అధ్యక్షత వహించి ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం సంవత్సరానికి ఒకసారి జరుగుతుందన్నారు. ఈ కమిటీ ప్రపంచ వారసత్వ సదస్సు అమలు చేస్తుంది.
Read Also: Delhi Weather: ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత.. నేడు తేలికపాటి వర్షం!
అయితే, యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ కమిటీకి దేశం నాయకత్వం వహించడంతో పాటు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ప్రపంచ స్థాయిలో సాంస్కృతిక, సహజ వారసత్వ ప్రదేశాల పరిరక్షణతో పాటు గుర్తింపు కోసం భారతదేశం చురుకుగా సహకరించడంతో ఈ అవకాశం వచ్చిందని విశాల్ వి శర్మ పేర్కొన్నారు. ఇక, యునెస్కో 16 నవంబర్ 1945న ఏర్పడింది.. ప్రపంచంలోని కళలు, విద్య, సైన్స్ తో పాటు సంస్కృతిలో అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రపంచ శాంతి, భద్రత కోసం ప్రయత్నించడం యునెస్కో యొక్క ముఖ్య ఉద్దేశ్యం.. ఇక, యునెస్కోలో 193 సభ్య దేశాలు, 11 అసోసియేట్ సభ్యులు ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌లో ఉంది. దాని గ్లోబల్ చార్టర్‌ను అమలు చేసే 199 దేశాలలో 53 ప్రాంతీయ కార్యాలయాలు, జాతీయ కమీషన్‌లు ఉన్నాయి.
India to chair & host UNESCO's World Heritage Committee for the 1st time from 21st to 31st July 2024 in New Delhi: Permanent Representative of India to UNESCO, Vishal V Sharma pic.twitter.com/IhJo2lJIuC
— ANI (@ANI) January 9, 2024