టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ పదవిని చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తున్నట్లు టాక్.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు కొన్ని రోజులు విరామం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ హమాస్కు ఒక ప్రతిపాదనను పంపింది. అందులో 2 నెలల పాటు యుద్ధాన్ని నిలిపివేయాలని కోరింది.
ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లే విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కెనడాకు చెందిన జస్టిన్ ట్రూడో ప్రభుత్వం వచ్చే రెండేళ్ల పాటు అంతర్జాతీయ విద్యార్థి వీసాలలో కోత విధించడంతో పాటు వీసా జారీపై పరిమితిని విధించింది.
నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అంటున్నారు.. బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు.
గత ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలనను ప్రజలకు దగ్గర చేస్తున్నామన్నారు. ఇక, ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే వివక్షతోనే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంకు అయోధ్య నుంచి ఆహ్వానం అందలేదని వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.