రామ నామాన్ని శరీరమంతా శాశ్వతమైన పచ్చబొట్లుగా వేయించుకునే రామనామీల తెగ మాది అని గులారామ్ పేర్కొన్నారు. ఈ తెగలో ఉదయం పలకరింపు రామ్-రామ్ అంటూ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి రోజంతా ఏ పని చేసినా రామనామాన్ని స్మరిస్తారు.
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ దగ్గర కొందరు రామ భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో పలువురు కార్లతో భారీ ర్యాలీలు తీశారు.
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామ సర్పంచ్ దంపతులు చిట్ల స్వరూపారాణి భూపాల్ రెడ్డికి అద్భుతమైన అవకాశం వచ్చింది. నెల్లుట్ల గ్రామపంచాయతీ కీర్తి పతాకాన్ని ఢిల్లీ గడ్డపై రెపరెపలాడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
పాకిస్థాన్ లో దేశవ్యాప్త ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అభ్యర్థి మెహర్ ముహమ్మద్ వాసిం పిఎంఎల్-ఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్‌కు అనుకూలంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇవాళ అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉండడంతో నిన్న (ఆదివారం) ఐస్ క్రీమ్ పుల్లలను ఉపయోగించి నమూనా రామ మందిరాన్ని సూక్ష్మ కళాకారుడు సున్నపు అశోక్ తయారు చేశాడు.. రోజుకు గంట చొప్పునా 20 రోజుల పాటు శ్రమించి మినీ రామ మందిరాన్ని నమూనాను తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు.
రామ భక్తులు ఈ ప్రాణ ప్రతిష్ట దివ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని పవిత్రమైన నీలకంఠ పక్షిని చూసేందుకు వెళ్తున్నారు. ఆగ్రాలో పెద్ద సంఖ్యలో రామ భక్తులు చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీకి క్యూ కట్టారు.
ఇవాళ అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పోలీసు కమిషనర్లు (సీఎస్పీ), పోలీసు సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు.