Congress Party: ఎన్టీవీతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జగన్ వైఎస్ ఫోటోను ఎలా వాడుకున్నారు.. ఇపుడు ఆ ఫోటో ఎక్కడ ఉందో ప్రజలకు తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ హయాంలో పాలన ఇప్పటి పాలనను ప్రజలు బేరీజు వేస్తున్నారు.. పోటీ చేస్తారా ప్రచారం మాత్రమే చేస్తారా అనే అంశాలపై వైఎస్ షర్మిల జవాబు ఇస్తారు.. రెండు లేదా మూడు రోజుల్లో వైఎస్ షర్మిలమ్మా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేయనున్నారు అని ఆయన పేర్కొన్నారు. షర్మిలకు టూర్ షెడ్యూల్ ను ఏఐసీసీ ఇవ్వనుంది అని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు.
Read Also: MP Kotagiri Sridhar: మార్పులు చేర్పులు చేసినపుడు సీటు కోల్పోయిన వారు బాధపడటం సహజం..
టీడీపీ- వైసీపీ పాలనలో విసుగు చెందిన వారంతా కాంగ్రెస్ వైపు రావటానికి సిద్దంగా ఉన్నారు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. నేను ఇవాళ కాంగ్రెస్ లో చేరుతున్నాను.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు షర్మిల నాయకత్వంలో ఊపు వస్తుంది అనే నమ్మకం ఉంది.. కాంగ్రెస్ పార్టీ 2004, 2009 ఏపీలో అధికారంలోకి వచ్చింది అనే విషయాన్ని విమర్శలు చేసే వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓట్ షేర్ 1 నుంచి 100 శాతానికి తీసుకు వెళ్తామని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.