ఢిల్లీలో ఇవాళ ఉదయం 10.30గంటల ప్రారంభమయ్యే 75వ గణతంత్ర వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటబోతుంది. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీని వీడిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ తిరిగి బీజేపీలో చేరారు.
రక్షణ శాఖకు అత్యాధునిక ఆయుధాలను తయారు చేసివ్వడంలో అద్భుతమైన ప్రగతి సాధించామని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కెనడాను భారత్ హెచ్చరించింది. కెనడా తమ దౌత్య సముదాయాలకు భద్రత కల్పించాలని భారత్ కోరింది.
లంచ్ బ్రేక్ సమయానికి 28 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ కీలకమైన 3 వికెట్లను కోల్పోయి 108 పరుగులు చేసింది. ఇక, ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బేయిస్ట్రో 32 పరుగులు, జో రూట్ 18 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నారు.
అస్సాంలోని గోలక్ గంజ్ నుంచి యాత్ర ప్రారంభించి కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా ధుబ్రి జిల్లాలోని హల్కురా గ్రామంలో ఆగిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గరకు చేరుకుని టీ తాగారు.
ఓ లారీ అదుపుతప్పి ముందువెళ్తున్న వాహనాలను ఢీకొన్న ఘటనలో నాలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా తోప్పూరు సమీపంలో నిన్న (బుధవారం) సాయంత్రం జరిగింది.