ind-vs-eng 1st test: హైదరాబాద్ వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. ఉప్పల్ స్టేడియంలో జరగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లీష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి 28 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ కీలకమైన 3 వికెట్లను కోల్పోయి 108 పరుగులు చేసింది. ఇక, ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బేయిస్ట్రో 32 పరుగులు, జో రూట్ 18 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నారు. అయితే, ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (20), బెన్ డకెట్ (35), ఆలీ పోప్ (1) పరుగులు చేసి అవుట్ అయ్యారు. భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీసుకోగా రవీంద్ర జడేజా ఒక్క వికెట్ తీసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు తీసిన మూడు వికెట్లు కూడా కేవలం భారత స్పినర్లకే దక్కాయి.
Read Also: Budget 2024 : మెడిక్లెయిమ్‌పై పన్ను ప్రయోజనాల పరిమితిని బడ్జెట్‌లో పెంచవచ్చా ?
అయితే, ఈ మ్యాచ్‌లో అశ్విన్- జడేజా బౌలింగ్ జోడి కూడా మరో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో టీమిండియాకు ఈ ఇద్దరి జోడి కలిసి 500 వికెట్లను పూర్తి చేసుకున్నారు. దీంతో టీమిండియా తరఫున 500 వికెట్లు తీసిన తొలి బౌలింగ్ జోడిగా అశ్విన్, జడేజా రికార్డ్ సృష్టించారు. ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టులో బెన్ డకెట్, ఓల్లీ పోప్, జాక్ క్రాలేను ఔట్ చేయడంతో ఈ రికార్డ్ ను తమ ఖాతాలో అశ్విన్ – జడేజా జోడి వేసుకుంది.