నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘రా.. కదలిరా’ సభ నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని.. 11:15 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 11:50 గంటలకు పీలేరుకు చేరుకోనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించడానికి భీమిలీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తలపాగాలో మెరిశారు. ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే దినోత్సవాల్లో వేడుకల్లో తలపాగా కట్టుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లీకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
అసెంబ్లీలో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని.. అది ఏ మాత్రం చిన్న సంఖ్య కాదన్నారు. అలాగే 25 మంది ఎమ్మెల్సీలు, 14 మంది ఎంపీలు బీఆర్ఎస్కు ఉన్నారని గుర్తుచేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ను ఎక్కువ.. తక్కువ చేస్తే మా తడాఖా ఏంటో చూపిస్తామని చెప్పుకొచ్చారు
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ప్రొఫెసర్, పౌర హక్కుల నేత హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇస్లామిక్ దేశాల తరహాలో భారతదేశంలోనూ మత విలువల ఆధారంగా ప్రత్యామ్నాయ రాజ్యాంగం రాబోతోందని హరగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు లేకపోతే చిన్న రాష్ట్రాల స్వేచ్ఛ ఉండేది కాదని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.. ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. గాజాలో ప్రస్తుత పరిస్థితులు నరకప్రాయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్లో కూడా ఘనంగా రిపబ్లిక్ వేడుకలు నిర్వహించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. కాగా, జెండా ఆవిష్కరణకు మాజీ హోంమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు.