Bharat Jodo Nyay Yatra: ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర.. రోడ్డు పక్కన టీ తాగిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పన్నెండవ రోజు ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించనుంది. అయితే, రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం అస్సాంలోని గోలక్ గంజ్ నుంచి యాత్ర ప్రారంభించి కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా ధుబ్రి జిల్లాలోని హల్కురా గ్రామంలో ఆగిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గరకు చేరుకుని టీ తాగారు.
Read Also: Panipuri: పానీపూరీ తిని ఇద్దరు చిన్నారులు మృతి!
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ఇక, టీ దుకాణం యజమాని ఈ మొత్తం ఘటన సంబంధించిన విషయాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ రాకను చూసి షాక్ అయ్యాను అని టీ స్టాల్ యాజమాని తెలిపారు. తన దుకాణంలోకి వచ్చి టీ తాగి, స్నాక్స్ తిని, ఇక్కడ ప్రసిద్ధి చెందిన పెరుగును రాహుల్ గాంధీ రుచి చూశారని దుకాణదారుడు చెప్పాడు. ఇక, ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించనుంది. కూచ్ బెహార్ నుంచి యాత్ర పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశిస్తుంది. ఈరోజు రాహుల్ గాంధీ కూచ్ బెహార్‌లోనే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ తన పశ్చిమ బెంగాల్ పర్యటన వ్యూహం ఏమిటి, ఈ సందర్భంగా ఎలాంటి అంశాలను లేవనెత్తారు అనే విషయాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు.
తాజావార్తలు
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!