తెలంగాణ ఉద్యమంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు లేకపోతే చిన్న రాష్ట్రాల స్వేచ్ఛ ఉండేది కాదని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.. ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. గాజాలో ప్రస్తుత పరిస్థితులు నరకప్రాయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్లో కూడా ఘనంగా రిపబ్లిక్ వేడుకలు నిర్వహించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. కాగా, జెండా ఆవిష్కరణకు మాజీ హోంమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు.
భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థులకు ఫ్రాన్స్ అందించే తోడ్పాటు గురించి కూడా అధ్యక్షుడు ఇమాన్యయేల్ మెక్రాన్ వివరించారు.
భారత్తో సరిహద్దు వివాదంపై డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దు వివాదంతో ముడిపెట్టడం సరికాదని వెల్లడించింది. డ్రాగన్ కంట్రీ చర్యల ఫలితంగానే తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.
నేపాల్ అధికార కూటమి నిన్న (గురువారం) ఖాళీగా ఉన్న 19 నేషనల్ అసెంబ్లీ సీట్లలో 18 గెలుచుకుంది. ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, భారత్లోని రష్యా రాయబార కార్యాలయం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. రష్యా రాయబార కార్యాలయం ఓ వీడియోను షేర్ చేసి 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపింది.
ఏఎస్ఐ రిపోర్టు పబ్లిక్గా మారినప్పటి నుంచి జ్ఞాన్వాపీ వ్యవహారం హీటెక్కింది. ఈ మొత్తం వ్యవహారంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. ఏఎస్ఐ నివేదికను తోసిపుచ్చారు.. ఈ నివేదిక కేవలం ఊహాగానాల ఆధారంగానే ఉంది.. ఇది శాస్త్రీయ అధ్యయనాన్ని అపహాస్యం చేయడమేనంటూ ఆయన మండిపడ్డారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే, ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనిక రవాణా విమానం కుప్పకూలిన ప్రాంతంలో దర్యాప్తు బృందానికి బ్లాక్బాక్స్ దొరికింది.