లంచ్ బ్రేక్ సమయానికి 28 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ కీలకమైన 3 వికెట్లను కోల్పోయి 108 పరుగులు చేసింది. ఇక, ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బేయిస్ట్రో 32 పరుగులు, జో రూట్ 18 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నారు.
అస్సాంలోని గోలక్ గంజ్ నుంచి యాత్ర ప్రారంభించి కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా ధుబ్రి జిల్లాలోని హల్కురా గ్రామంలో ఆగిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గరకు చేరుకుని టీ తాగారు.
ఓ లారీ అదుపుతప్పి ముందువెళ్తున్న వాహనాలను ఢీకొన్న ఘటనలో నాలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా తోప్పూరు సమీపంలో నిన్న (బుధవారం) సాయంత్రం జరిగింది.
రేపు (జనవరి 26న) దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే సంబరాలు జరుగనున్నాయి. దేశ రాజధానిలోని కర్తవ్య మార్గ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో దాదాపు 14,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
ఢిల్లీ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయం తీసుకున్నారు. AI వినియోగం బాధితుడిని గుర్తించడంలో సహాయపడటమే కాకుండా హత్యకు కారణమైన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేందుకు హెల్ప్ చేసింది.
అమెరికా- బ్రిటన్ దేశాల మధ్య ఈ టీ వల్ల వివాదం చెలరేగింది. యూఎస్ కు చెందిన ఓ ప్రొఫెసర్ టీ ఎలా తయారు చేయాలో చెబుతూ చేసిన సూచన బ్రిటన్ వాసులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.
మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ- డెమొక్రాట్లు సంయూక్తంగా విడుదల చేసిన ప్రకటనలో.. మా మిత్రదేశాన్ని ( భారత్ ) వేరు చేయడం వల్ల మాల్దీవుల దీర్ఘకాలిక అభివృద్ధికి తీవ్ర నష్టం వాటిల్లుంతన్నారు.
తెలంగాణలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను తీసుకుంది.