విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ వేడుకల కోసం సీఎం జగన్ ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు పయనం అవుతారు. మళ్లీ సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆథిత్యం ఇచ్చే ఎట్ హోం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు.
Read Also: Sri Lalitha Sahasranama Stotram: ఈ స్తోత్రం వింటే ఇంట్లో సుఖ శాంతులు కలుగుతాయి
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం 8 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.. అలాగే, ఉదయం 8.15 గంటలకు రాష్ట్ర అసెంబ్లీ భవనం దగ్గర శాసన సభాపతి తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఇక, సచివాలయం మొదటి బ్లాకు వద్ద ఉదయం 7.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే, నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దగ్గర ఉదయం 10 గంటలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింఘ్ ఠాకూర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.