ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆప్ పార్టీకి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను కొని తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ట్రై చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చాపకింద నీరులా చకచక మార్పులు, చేర్పులు జరిగిపోతుంటాయి. ఇందుకు బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలే ఉదాహరణ. నిన్నటిదాకా నితీష్‌కుమార్ నాయకత్వంలో సాఫీగా సాగిపోతున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఒక్కసారిగా సంక్షోభం తలెత్తింది.
బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఇవాళ నితీశ్ కుమార్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. దాంతో ఇప్పటి వరకూ ఉన్న ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులపై కొనసాగుతున్న విచారణ కొనసాగుతుంది. హెచ్ఎండీఏలో సంవత్సర కాలంగా బాలకృష్ణ అనుమతులపై విచారణ కొనసాగుతుంది. ఇక, బాలకృష్ణకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది.
బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
లోక్‌సభ ఎన్నికల వేళ భారతదేశంలో ఓటర్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలో త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని తెలిపింది.
శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలోని వైసీపీలో లేఖ కలకలం రేపుతుంది. నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంపై ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ పరిశీలకుడు ఆశోక్ కుమార్ కు ఎమ్మెల్యే లేఖ రాశాడు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నారు.