India China Row: గల్వాన్ మాదే.. ఘర్షణలకు భారతే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌తో సరిహద్దు వివాదంపై డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దు వివాదంతో ముడిపెట్టడం సరికాదని వెల్లడించింది. డ్రాగన్ కంట్రీ చర్యల ఫలితంగానే తూర్పు లద్ధాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సరిహద్దు వివాదంపై ఇరు దేశాల సైన్యాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
Read Also: Nithiin: రాబిన్ హుడ్… ఐకానిక్ క్యారెక్టర్ అయ్యేలా ఉంది
Also Read
ఇక, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లఘించి 2020లో వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యనించారు. ఇక, దీనిపై చైనా రక్షణ శాఖ ప్రతినిధి వు కియాన్ స్పందించారు. ఎల్‌ఏసీ వెంబడి తమ భూభాగం వైపే ఈ లోయ ఉందని చైనా చేస్తోన్న వాదనను డ్రాగన్ కంట్రీ రక్షణశాఖ ప్రతినిధి పునరుద్ఘాటించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత భారత్‌దేనని అతడు పేర్కొనడం గమనార్హం.
Read Also: K.Lakshman: తెలుగు తేజాలకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ రావడం సంతోషం
అయితే, భారత్‌తో సరిహద్దు వివాదం వారసత్వంగా కొనసాగుతుందని చైనా రక్షణ శాఖ ప్రతినిధి వు కియాన్ తెలిపారు. దానిని ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం సరైన పద్దతి కాదన్నారు. ఇరు దేశాల భాగస్వామ్య ప్రయోజనాలకు ఇది విరుద్ధంగా ఉంద అని పేర్కొన్నారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.. సరిహద్దు ప్రాంతంలో విబేధాలను పరిష్కరించేందుకు భారత్ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. సరిహద్దు దగ్గర అసాధారణ పరిస్థితులు నెలకొన్నంత వరకు చైనాతో సాధారణ స్థితిని పునరుద్ధరించడం అసాధ్యమని భారత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?