నేపాల్ అధికార కూటమి నిన్న (గురువారం) ఖాళీగా ఉన్న 19 నేషనల్ అసెంబ్లీ సీట్లలో 18 గెలుచుకుంది. ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పార్లమెంటు ఎగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీకి గురువారం తెల్లవారుజామున ఓటింగ్ జరిగింది. ఇక, 59 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీలో 20 మంది ఎంపీల పదవీకాలం మార్చి 3తో ముగియనుంది. ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) కోసి ప్రావిన్స్‌లో ఒక్క సీటును గెలుచుకుంది.. ఇక, పాలక కూటమి మిగతా ఆరు ప్రావిన్సులను కైవసం చేసుకుంది.
Read Also: Ayodhya : ఉపాధి అవకాశాలను సృష్టిస్తోన్న అయోధ్య టూరిజం… దాదాపు 2లక్షల ఉద్యోగాలకు అవకాశం
అలాగే, అధికార కూటమిలో నేపాలీ కాంగ్రెస్ 10, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) ఐదు, కమ్యూనిస్ట్ పార్టీ నేపాల్ (యూనిఫైడ్ సోషలిస్ట్) రెండు, జనతా సమాజ్ వాదీ పార్టీ ఒక సీటు గెలుచుకున్నాయి. జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత CPN-మావోయిస్ట్ సెంటర్ 59-సీట్ల జాతీయ అసెంబ్లీలో 18 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేపాల్ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకు మూడింట ఒక వంతు సీట్లు ఖాళీగా అవుతాయి. ఇక, నేషనల్ అసెంబ్లీలోని 19 స్థానాలకు ఎన్నికల ద్వారా భర్తీ చేశారు. కేబినెట్ సిఫార్సుపై ఒక సభ్యుడిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.