చంద్రబాబు విచారణకు సహకరించపోతే బెయిల్ రద్దు పిటిషన్ వేయండి.. ఈ దశలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని కేసు విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దిపాంకర దత్తల సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
నాన్ లోకల్ నేతలు జగన్ పై మాట్లాడుతూన్నారు అని మంత్రి రోజా తెలిపారు. విశాఖపట్నం మించిన సభ రాయలసీమలో జరుగుతుంది.. టీడీపీ అధినేత చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నాడు.. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేడు.. వైఎస్ షర్మిల నాలుగో కృష్ణుడు లాంటిది..
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ఐదవ జాబితా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
కృష్ణా జిల్లా వైసీపీలో బందరు ఎంపీ సీటు రచ్చ కొనసాగుతుంది. అయితే, బందరు ఎంపీ అభ్యర్థిగా వెళ్ళాలని అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను వైసీపీ అధిష్టానం కోరింది. దీనికి అతడు స్పందిస్తూ.. తాను చిన్న వాడిని సరిపోనేమో మరోసారి ఆలోచన చేయాలని వైసీపీ అధిష్టానాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కోరినట్టు సమాచారం.
అనంతపురం జిల్లాలోని టీడీపీ సీనియర్లలో టికెట్ టెన్షన్ నెలకొంది. సీనియర్లు, జూనియర్లు లేరని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీట్ల కేటాయింపునకు సర్వేలే కీలకం అని చెప్పుకొచ్చారు. త్యాగాలకు సిద్దంగా ఉండాలని సూచన చేసినట్లు సమాచారం.
తొండపిలో ఎవరిమీద దాడి జరిగినా అది మంచి పద్దతి కాదు అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తొండపి ఘర్షణలను ఖండిస్తున్నా.. నేను దాడి చేయించానని, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నాపై చేస్తున్న కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఎందుకంటే, తొండపి గ్రామం చాలా సున్నితమైన సమస్యాత్మక ప్రాంతం అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం అనర్హత పిటిషన్లపై విచారణ చేయనున్నారు. ఈ సందర్భంగా అమరావతికి నెల్లూరు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చేరుకున్నాయి. అనర్హత పిటిషన్ పై స్పీకర్ తో విచారణకు హాజరయ్యే అంశంపై వైసీపీ రెబెల్స్ తర్జన భర్జన పడుతున్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపుతుంది. కాండ్రకోట గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు, కుంకుమ, ఎండు మిర్చిలతో పూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు హడలిపోతున్నారు.
ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం కాబోతుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలుపనుంది. 5 వేల కోట్ల రూపాయల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది.
అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. నేడు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారించనున్నారు.