నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించబోతున్నారు. ఉదయం 10.30 గంటలకు ముస్తాబాద్ జడ్పిటిసి కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమానికి హాజరుకానున్నారు.
భారతదేశంలోనే తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని ఉత్పత్తి చేయడానికి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( CMFRI) ఒక కీలక ప్రాజెక్ట్ చేపట్టింది. సీఫుడ్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా సరఫరాను పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి చాక్లెట్స్ గుట్టు రట్టు అయింది. 4 కేజీల గంజాయి చాక్లెట్స్ ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు.
నేడు ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ల చేత శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. నేటి ఉదయం 9. 30 గంటలకు శాసనసభ మండలి ఛైర్మన్ కార్యాలయంలో జరుగనుంది.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగుతునే ఉంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 26 వేల మందికి పైగా మరణించారు. గాజా- ఇజ్రాయేల్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఖతార్ ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ మధ్యవర్త్వం వహిస్తున్నారు.
17వ లోక్‌సభ చివరి సమావేశాలు రేపటి (జనవరి 31)నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నేటి ఉదయం 11.30 గంటలకు సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమాచారం ఇచ్చింది.
విజయనగరం జిల్లా మహారాజుపేట గ్రామములో వృద్దురాలి హత్య కేసులో మిస్టరీ వీడింది. హంతకుడు విజయనగరం మండలం గుంకలాం గ్రామానికి చెందిన ఇజ్జరపు కుర్మారావుగా పోలీసులు వెల్లడించారు. హంతకుడు కూర్మారావు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్ధిగా గుర్తించారు.
భీమిలిలో సిద్దం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కటౌట్స్ ఏర్పాటు చేశారు అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పంచింగ్ బ్యాగ్స్ ఏర్పాటు చేసి పైశాచిక ఆనందం సీఎం జగన్ పొందుతున్నారు.. పరిపాలన వదిలి ప్రజలను రెచ్చ గొట్టే పని చేస్తున్నారు.
టీటీడీ పాలకమండలి నిర్ణయాలను చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5141 కోట్ల రూపాయల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.