తెలంగాణ రాష్ట్ర హై కోర్టు మరో కీలక తీర్పు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇవాళ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. దాసోజీ శ్రావణ్, సత్యనారాయణ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేసింది.
జేఏ యాడ్స్ అనే అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీలో ఏపీ సీఐడీ అధికారులమంటూ కంపెనీలోకి పది మంది వెళ్లినట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. ఐటీ కంపెనీ యజమాని దగ్గర నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలను నకిలీ ఏపీ సిఐడి అధికారులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా దామగండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ ఏర్పాటు వల్ల అడవులు, గాలి, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే నేవీ రాడార్ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కుటుంబ పెన్షన్కు సంబంధించిన నిబంధనలలో కీలకమైన మార్పులు చేసింది. మహిళా ఉద్యోగులు తమ భర్తకు బదులుగా కొడుకు లేదా కూతురిని నామినీగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ లో ఇవాళ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన నర్సంపేట ఛైర్మెన్ గుంటీ రజినీ కిషన్ పై అవిశ్వాస తీర్మనాన్ని ప్రవేశ పెట్టి కలెక్టరేట్ లో కొంత మంది కౌన్సిలర్లు సమర్పించారు.
డ్రాగన్ కంట్రీ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (MDP) రెడీ అవుతుంది.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దాదాపు 18 గంటలుగా కనిపించకుండా పోయారు. ఆయన కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం వేచి చూస్తుంది. అయితే, నిన్న ఢిల్లీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ ఓ బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుంది.
కరీంనగర్ లోని కస్తూర్భా కాలేజీలో దారుణం జరిగింది. కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అక్షిత మృత దేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు శాంతినగర్ కస్తూర్బా ప్రిన్సిపాల్ తరలించారు.