కృష్ణా జిల్లా వైసీపీలో బందరు ఎంపీ సీటు రచ్చ కొనసాగుతుంది. అయితే, బందరు ఎంపీ అభ్యర్థిగా వెళ్ళాలని అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను వైసీపీ అధిష్టానం కోరింది. దీనికి అతడు స్పందిస్తూ.. తాను చిన్న వాడిని సరిపోనేమో మరోసారి ఆలోచన చేయాలని వైసీపీ అధిష్టానాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కోరినట్టు సమాచారం.. అయితే, ఎంపీగా సింహాద్రి సరిపోతాడనే ఆలోచనలో అధిష్టానం ఉంది. ఇక, ఫైనల్ గా అధిష్టానం ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఏది పోటీ చేయమంటే అది చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సింహాద్రి రమేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ.. నన్ను బందరు ఎంపీగా వెళ్ళమన్న మాట వాస్తవం.. సీఎం జగన్ ఎంపీగా చేయమంటే పోటీ చేస్తాను అని పేర్కొన్నారు. వేరే ఆలోచన చేయను.. నా కంటే మంచి అభ్యర్ధి ఉన్నారు ఆగమంటే ఆగుతా.. చివరి వరకు జగన్ వెంటే నడుస్తాను.. జగన్ ఏది చెబితే అది చేస్తాను తప్ప వేరే ఆలోచన నాకు ఉండదు అని ఆయన తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిని పార్టీ సింహాద్రి రమేష్ పేరును దాదాపుగా ఫైనల్ చేసింది. అయితే, బందరు ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేసినట్లు టాక్.