Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తికి కాల్చి చంపింది వీళ్లే.. అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా లింఛింగ్ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు దేశ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ శనివారం తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని 27 ఏళ్ల సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌గా యూనస్ ప్రభుత్వం గుర్తించింది. ఎక్స్ (ట్విటర్)లో చేసిన పోస్టులో యూనస్.. “మైమెన్సింగ్‌లోని భలుకా ప్రాంతంలో సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను కొట్టి చంపిన ఘటనలో ర్యాపిడ్ యాక్షన్ బ్యాటాలియన్ (RAB) ఏడుగురిని అనుమానితులుగా అరెస్ట్ చేసింది” అని పేర్కొన్నారు. అరెస్ట్ అయినవారిలో ఎం.డి. లిమోన్ సర్కార్ (19), ఎం.డి. తారెక్ హొస్సేన్ (19), ఎం.డి. మాణిక్ మియా (20), ఎర్షాద్ అలీ (39), నిజుమ్ ఉద్దిన్ (20), అలొంగీర్ హొస్సేన్ (38), ఎం.డి. మిరాజ్ హొస్సేన్ అకోన్ (46) ఉన్నారని తెలిపారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
అయితే.. శుక్రవారం మైమెన్సింగ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ని దారుణంగా కొట్టి, చెట్టుకు కట్టేసి, కాల్చి చంపారు. చంద్ర దాస్ మహమ్మద్ ప్రవకర్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చంపేసినట్లు బంగ్లా మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ హింసపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ నిన్న(శుక్రవారం) స్పందించారు. “మైమెన్సింగ్‌లో ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపిన సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యూ బంగ్లాదేశ్‌లో ఈ రకమైన హింసకు చోటు లేదు. ఈ క్రూరమైన నేరంలో పాల్గొన్న ఎవరినీ వదలబోం” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని తీవ్రవాద గ్రూపులు నిర్వహిస్తున్న హింస పట్ల అప్రమత్తంగా ఉండాలని తాత్కాలిక ప్రభుత్వం ప్రజలను కోరింది. హింస, భయం, దహనం, విధ్వంసం వంటి చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్ కీలకమైన సమయంలో చారిత్రాత్మక ప్రజాస్వామ్య పరివర్తన గుండా వెళ్తోందని, గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నాలను సృష్టించి దేశం అశాంతి వైపు ప్రయణించడాన్ని అనుమతించబోమని హెచ్చరించారు.
READ MORE: Actress Amani Joins BJP: బీజేపీ తీర్థం పుచ్చుకున్న నటి ఆమని
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!