నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ లో ఘోర రోడ్డు చోటు చేసుకుంది. అదుపుతప్పి కారు బోల్తా పడింది.. దీంతో ఆ కారును లారీ ఢీ కొట్టింది. దీంతో సంఘటన ప్రదేశంలోనే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఈ నెల 30న బిహార్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనవల్సిందిగా ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను కాంగ్రెస్ ఆహ్వానించింది. ఇదే విషయాన్ని గుర్తుచేసేందుకు నితీష్‌కుమార్‌కు సోనియాగాంధీ ఫోన్ చేశారని సమాచారం.
బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి.
కులగణనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఏన్టీవీతో మాట్లాడుతూ.. ఇంతకీ పవన్ కళ్యాణ్ కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలన్నారు. అవగాహన రాహిత్యంతో పవన్ కళ్యాణ్ కులగణనపై వ్యాఖ్యలు చేసారు.. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
భీమిలీలో వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావం సిద్ధం బహిరంగ సభ దగ్గర ఎన్టీవీతో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మేం దేనికైనా సిద్దం.. అభివృద్ధి చూపించేందుకు సిద్దం.. కలిసి వస్తున్న రాజకీయ పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. వైనాట్ 175 నినాధం మొదటి నుంచి వినిపిస్తున్నాం.. నేడు అదే నినాధంతో సిద్దమౌతున్నాను అని ఆయన వెల్లడించారు
జగన్ రెడ్డి పాలనలో కేవలం రాజకీయ నిరుద్యోగల కోసమే బీసీ కార్పొరేషన్లు పెట్టారు.. బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు పేరుకే బీసీలు.. అధికార పెత్తనం అంతా వైసీపీ అగ్ర కుల పెద్దలదే అని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు.
విజయవాడలో మూడు దారులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, దేవులపల్లి అమర్, ఆర్.వి.రామారావు పాల్గొన్నారు. రాజకీయ రంగాన భిన్న దృశ్యాలు అంశంతో దేవులపల్లి అమర్ పుస్తకం రచించారు.
బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ఆర్జేడీ అప్రమత్తమైంది. మహాకూటమి నుంచి బయటకు రావాలని ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తీసుకున్న నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై ఆర్జేడీ కసరత్తు ప్రారంభించింది. దెబ్బకు దెబ్బ కొట్టేందుకు పార్టీ నేతలతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యనేతలతో కలిసి మేథోమదనం చేస్తున్నారు.