అనంతపురం జిల్లాలోని టీడీపీ సీనియర్లలో టికెట్ టెన్షన్ నెలకొంది. సీనియర్లు, జూనియర్లు లేరని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీట్ల కేటాయింపునకు సర్వేలే కీలకం అని చెప్పుకొచ్చారు. త్యాగాలకు సిద్దంగా ఉండాలని సూచన చేసినట్లు సమాచారం. సామాజిక సమీకరణాల లెక్కలూ వేస్తాం అని పార్టీ చీఫ్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. దశాబ్ధాలుగా నియోజకవర్గాల్లో కర్చీప్ వేసుకుని ఉన్న నేతల్లో ఆందోళన నెలకొంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కలిసి పని చేయాలని టీడీపీ బాస్ పిలుపునిచ్చారు. చంద్రబాబు పర్యటనలో సీట్ల లెక్కలు తేల్చేస్తారని టికెట్ ఆశించిన నేతల్లో గుబులు రేపుతుంది.
Read Also: Daggubati Family: డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు.. దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు!
సర్వే ఆధారంగానే టికెట్ ఇస్తామని సుత్తిలేకుండా చంద్రబాబూ సూటిగా చెప్పేసిన వైనం. ఉమ్మడి అనంతపురం జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈ కామెంట్స్ చేసినట్లు టాక్.
గత వారం హైదరాబాద్ లో చంద్రబాబును జేసీ ఫ్యామిలీ కలిసింది. అనంతపురం ఎంపీ సీట్ ను జేసీ పవన్ కుమార్ రెడ్డికి ఖరారు చేయాల్సిందిగా జేపీ ప్రభాకర్ రెడ్డి కోరారు. అయితే, సర్వేల తర్వాతేనన్న బాబు చెప్పుకొచ్చారు. దీంతో ఎవరి సీట్ ఉంటుందో.. ఎవరి సీట్ పొతుందోన్న ఆందోళనలో అనంతపురం తెలుగు తమ్ముళ్లు ఆందోళనలో ఉన్నారు.